December Car Offers: ఇటీవల కేంద్ర ప్రభుత్వం చిన్న కార్లపై జీఎస్టీ రేట్లను భారీగా తగ్గించగా.. కార్ల ధరలు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఇతర డిస్కౌంట్లను కూడా అందిస్తున్నాయి. ఇప్పుడు మారుతీ సుజుకీ ఇయర్ ఎండ్ ఆఫర్లను ప్రకటించింది. కొన్ని మోడళ్లపై గరిష్ఠంగా రూ. 2.19 లక్షల వరకు డిస్కౌంట్ ఉంటుంది. ఏయే మోడళ్లపై ఆఫర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

>> ఈ డిస్కౌంట్లలో డైరెక్ట్ కన్జూమర్ క్యాష్ డిస్కౌంట్స్ సహా ఎక్స్చేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్, కార్పొరేట్ లేదా ఇన్‌స్టిట్యూషనల్ స్కీమ్స్, రూరల్ ఆఫర్స్ వంటివి ఉన్నాయి. వీటిని తన ఎరినా, నెక్సా రిటైల్ నెట్‌వర్క్స్ ద్వారా అందిస్తోంది. ఈ డిస్కౌంట్లు.. ప్రాంతాన్ని బట్టి.. డీలర్‌ను బట్టి.. వేరియంట్.. మోడల్‌ను బట్టి వేర్వేరుగా ఉంటాయి. ఈ ఇయర్ ఎండ్ ఆఫర్లు డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయని చెప్పొచ్చు.
మారుతీ తన ఆల్టో కే10 మోడల్‌పై గరిష్ఠంగా రూ. 52,500 వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది. బేస్ మోడల్ ఎక్స్ షోరూం ధర కనీసం రూ. 3.70 లక్షల్లోపే ఉండగా.. డిస్కౌంట్లతో ఇది రూ. 3.50 లక్షల లోపు ధరలోనే అందుబాటులోకి రానుంది. ఆన్ రోడ్ ప్రైస్ చూస్తే రూ. 4 నుంచి 6 లక్షల మధ్య ఉండనుంది. వేరియంట్లను బట్టి ధరల్లో తేడాలు ఉంటాయి. ఎస్ ప్రెస్సో మోడల్‌పై రూ. 52,500 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ పై రూ. 58,100 వరకు తగ్గింపుల్ని ప్రకటించింది.
మారుతీ సుజుకీ సెలెరియోపై రూ .52500, స్విఫ్ట్‌పై రూ. 55 వేలు, డిజైర్‌పై రూ. 12500, ఎర్టిగా రూ. 10 వేలు, ఈకో రూ. 52500, బ్రెజ్జా రూ. 40 వేల డిస్కౌంట్ ధరల్లో అందుబాటులోకి వస్తోంది. ఇంకా ఇగ్నిస్ మోడల్‌పై రూ. 81,200 తగ్గింపుల్ని ప్రకటించింది. బాలెనోపై రూ. 57100, ఫ్రాంక్స్ మోడల్‌పై రూ. 65 వేలు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఇంకా జిమ్నీపై రూ. 1 లక్ష, ఇన్విక్టోపై రూ. 2.15 లక్షల డిస్కౌంట్లు ఉన్నాయి. తన ఫేమస్ మోడల్ గ్రాండ్ విటారాపై చూస్తే గరిష్ఠంగా రూ. 2.19 లక్షలు తగ్గింపు ఉంది. బేస్ మోడల్‌పై ఎక్స్ షోరూం ధరలు కనీసం రూ. 10.77 లక్షల నుంచి రూ. 19.72 లక్షల మధ్య ఉన్నాయి. ఇప్పుడు వీటిపై రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉండనుందని చెప్పొచ్చు.









